Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో  'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర'  కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

నేడు శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' కార్యక్రమంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు

NAVYA MEDIA 1 week ago

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నేడు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'స్వర్ణాంధ్ర - స్వచ్ఛాంధ్ర' క్షేత్రస్థాయి కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు.

అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రజావేదిక సభలో ప్రసంగించారు. పారిశుధ్యం, పర్యావరణ పరిరక్షణ మరియు ప్రజా సంక్షేమమే ధ్యేయంగా నిర్వహించిన ఈ పర్యటనలో ముఖ్యమంత్రి కీలక ప్రకటనలు మరియు పనులను చేపట్టారు.

ప్రతి నెలా 3వ శనివారం నిర్వహిస్తున్న 'స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర' కార్యక్రమం పరిశుభ్రత-పర్యావరణ విషయంలో ఎంతో మార్పు తీసుకువచ్చిందని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు.

16 నెలలుగా ఈ కార్యక్రమం ద్వారా సాధించిన విజయాల నుంచి స్ఫూర్తి పొంది, మరింత కష్టపడి పనిచేయాలని అధికారులకు సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా పారిశుధ్యాన్ని మరింత మెరుగుపరిచేందుకు వీలుగా నరసన్నపేట వేదికగా సీఎం చంద్రబాబు ‘ఆపరేషన్ క్లీన్ స్వీప్’ కార్యక్రమాన్ని అధికారికంగా ప్రారంభించారు.

పర్యావరణ పరిరక్షణలో భాగంగా, ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించేందుకు నరసన్నపేటలో ఒక ప్లాస్టిక్ రీసైక్లింగ్ మెషిన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించారు.

బహిరంగ సభావేదికపై ఒక పారిశుధ్య మహిళా కార్మికురాలిని తన పక్కనే కూర్చోబెట్టుకుని, ఆత్మీయంగా ముచ్చటించి ఆమె సేవలను కొనియాడారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia