పారిశ్రామిక వేత్త, రీజెన్సీ గ్రూప్ అధినేత జీఎన్ నాయుడు పార్ధివ దేహానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళులర్పించారు.
హైదరాబాద్‌లో వారి నివాసానికి వెళ్లి జీఎన్ నాయుడుకు నివాళులర్పించారు.
తెలుగు ప్రజలు మంచి పారిశ్రామికవేత్తను కోల్పోయారని, రీజెన్సీ స్థాపనతో యువతకు ఉపాధి కల్పనలో జీఎన్ నాయుడు కృషి ఎనలేనిదని సీఎం అన్నారు.
సమాజ సేవకు జీఎన్ నాయుడు తన వంతు కృషి చేశారని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన సీఎంచంద్రబాబు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఈ సందర్భంగా జీఎన్ నాయుడుతో తనకు ఉన్న పరిచయాన్ని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు.

