Dailyhunt
పశ్చిమ బెంగాల్‌లో మే 9వ తేదీన కొత్త బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు

పశ్చిమ బెంగాల్‌లో మే 9వ తేదీన కొత్త బీజేపీ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయనున్నారు

NAVYA MEDIA 1 week ago

శ్చిమ బెంగాల్ లో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తాన్ని ఖరారు చేసింది.

నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి సందర్భంగా మే 9వ తేదీన నూతన ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేస్తారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమీక్ భట్టాచార్య వెల్లడించారు.

ఠాగూర్ ఆశీస్సులతో రాష్ట్రంలో ఒక నూతన శకాన్ని ప్రారంభించాలనే ఉద్దేశంతోనే ఈ తేదీని ఎంచుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

రాజ్యాంగ నిబంధనల ప్రకారం ప్రస్తుత ముఖ్యమంత్రి మమతా బెనర్జీని రాజీనామా చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానిస్తారు.

కొత్త ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారం చేసే వరకు మమతా బెనర్జీ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా తన విధులను కొనసాగిస్తారు.

ప్రభుత్వ ఏర్పాటుకు ముహూర్తం ఖరారైనప్పటికీ, బెంగాల్ పీఠాన్ని అధిరోహించబోయే ఆ ‘కీలక నేత’ ఎవరనే దానిపై బీజేపీ అధిష్ఠానం ఇంకా రహస్యాన్ని మెయింటైన్ చేస్తోంది.

మరో రెండు రోజుల్లో ఈ ఉత్కంఠకు తెరపడే అవకాశం ఉంది. సీఎం రేసులో సువేందు అధికారి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia