కవిత్వాన్ని కార్మిక, కర్షక, శ్రామిక వర్గాల స్వరంగా మలిచిన ప్రజాకవి శ్రీశ్రీ. సమసమాజ నిర్మాణంలో కవులు, కళాకారులు కీలక పాత్ర పోషించాలని, దోపిడీ వ్యవస్థలను ధైర్యంగా ప్రశ్నించాలని సూచించిన మహానుభావుడు.
"మానవుడే నా మతం" అనే భావజాలాన్ని ప్రతిపాదించిన శ్రీశ్రీ జయంతి సందర్భంగా ఆ మహాకవి స్ఫూర్తిని మనం స్మరించుకుందాం అని చంద్రబాబు ట్వీట్ చేసారు.

