Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల వేడుక.. పాల్గొన్న ప్రధాని మోదీ

రాష్ట్రపతి భవన్‌లో ఘనంగా పద్మ అవార్డుల వేడుక.. పాల్గొన్న ప్రధాని మోదీ

NAVYA MEDIA 9 hrs ago

రాష్ట్రపతి భవన్‌లో వైభవంగా రెండవ విడత పద్మ అవార్డుల ప్రదానోత్సవం

పద్మ అవార్డుల రెండవ విడత ప్రదానోత్సవం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో అత్యంత వైభవంగా జరిగింది.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65 మంది ప్రముఖులకు ఈ అవార్డులను ప్రదానం చేశారు.

65 మందికి పద్మ పురస్కారాలు

ఇందులో ఇద్దరు పద్మ విభూషణ్, ఏడుగురు పద్మ భూషణ్, 56 మంది పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరించారు.

ప్రముఖుల హాజరు

న్యూ ఢిల్లీ రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఉప రాష్ట్రపతి రాధాకృష్ణన్, ప్రధాని నరేంద్ర మోడీ, లోక్‌సభ స్పీకర్ ఓంబిర్లా, మాజీ రాష్ట్రపతి రామనాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు అమిత్ షా, పీయూష్ గోయల్, కె. రామమోహన్ నాయుడు, బండి సంజయ్ తదితరులు హాజరయ్యారు.

మురళీ మోహన్, రాజేంద్ర ప్రసాద్‌కు పద్మశ్రీ

ఈసారి పద్మశ్రీ పురస్కారాన్ని నటులు మాగంటి మురళీ మోహన్, గద్దె రాజేంద్ర ప్రసాద్ స్వీకరించారు. సినిమా రంగంలో వీరు సాధించిన విజయాలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించింది.

పద్మ పురస్కార గ్రహీతలపై ప్రధాని ప్రశంసలు

2026 పద్మ పురస్కార గ్రహీతల జీవితం ఎంతో స్ఫూర్తిదాయకమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. జూన్ 23న రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న ప్రధాని మోడీ అందరినీ అభినందించారు.

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 65 మందికి పద్మ పురస్కారాలను ప్రదానం చేసిన తరువాత ప్రధాని మోడీ వారితో మాట్లాడారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia