Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
రష్యాలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ పర్యటన

రష్యాలో కొనసాగుతున్న మంత్రి నారా లోకేశ్ పర్యటన

NAVYA MEDIA 2 weeks ago

ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రష్యాలో అధికారిక పర్యటన కొనసాగిస్తున్నారు.

జూన్ 2 నుండి జూన్ 7 వరకు జరిగే ఆరు రోజుల పర్యటనలో భాగంగా ఆయన రష్యా రాజధాని మాస్కో చేరుకుని, అక్కడ పలువురు పారిశ్రామికవేత్తలు, ఆర్థిక నిపుణులతో ముమ్మరంగా సమావేశాలు జరుపుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పెట్టుబడుల గమ్యస్థానంగా ప్రమోట్ చేయడం మరియు గ్లోబల్ ప్రాజెక్ట్‌లను ఆకర్షించడం. రష్యాలో జరిగే ప్రతిష్టాత్మక సెయింట్ పెటర్స్‌బర్గ్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ ఫోరమ్ (SPIEF) లో ఆయన ప్రత్యేక ఆహ్వానితుడిగా పాల్గొంటున్నారు.

మాస్కో అడ్వాన్స్‌డ్ ట్రాన్స్‌పోర్ట్ సెంటర్ ను సందర్శించిన మంత్రి నారా లోకేశ్. సెమీకండక్టర్ దిగ్గజం ఎలిమెంట్ గ్రూప్ ప్రెసిడెంట్ ఖజోవ్‌తో మంత్రి లోకేశ్ సమావేశమయ్యారు.

ఈ సందర్భంగా విశాఖపట్నంలో ఎలక్ట్రానిక్ కాంపొనెంట్ అసెంబ్లీ యూనిట్, నెల్లూరులో సెమీకండక్టర్ పరికరాల తయారీ యూనిట్, మరియు శ్రీసిటీలో రోబోటిక్స్ & ఆటోమేషన్ సేవలను విస్తరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన ఎలిమెంట్ గ్రూప్.

రష్యాకు చెందిన ప్రముఖ రిటైల్ బ్యాంకింగ్ దిగ్గజం 'స్బేర్‌బ్యాంక్' సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఆల్బర్ట్ యెఫిమోవ్‌తో భేటీ అయ్యారు. ఏపీలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సాంకేతిక రంగాల అభివృద్ధికి సహకరించాల్సిందిగా స్బేర్‌బ్యాంక్ ప్రతినిధులను కోరారు.

విశాఖపట్నం కేంద్రంగా రూపాయి-రూబుల్ కరెన్సీల్లో వాణిజ్య కార్యకలాపాలు సాగించే అవకాశం కల్పించాలని ఒక వినూత్న ప్రతిపాదనను కూడా ఈ సందర్భంగా ఉంచారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia