Dailyhunt
సాయిధరమ్‌తేజ్ తో రొమాన్స్‌ చేయనున్న రాశిఖన్నా..!

సాయిధరమ్‌తేజ్ తో రొమాన్స్‌ చేయనున్న రాశిఖన్నా..!

NAVYA MEDIA 5 years ago

రాశీఖన్నా తెలుగు, తమిళం, మలయాళ భాషలలో నటిస్తూ బిజీగానే ఉంది. 2014లో వచ్చిన ఊహలు గుసగుసలాడే అనే చిత్రంలో కథానాయికగా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న రాశీ ఖన్నా ఇటీవల విడుదలైన జై లవకుశ,టచ్ చేసి చూడు , తొలి ప్రేమ చిత్రాలతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోను తన హవా చూపిస్తున్న రాశీ ఖన్నా.. అధర్వకు జోడీగా 'ఇమైకా నొడిగల్‌' అనే చిత్రం చేసింది. ఈ చిత్రంతో తమిళ తెరకి పరిచయం అయింది. ఆ తర్వాత జయం రవికి జోడీగా 'అడంగామరు', విశాల్‌కి జోడీగా అయోగ్య అనే చిత్రాలలో నటించింది. ప్రస్తుతం సిద్ధార్థ్‌ హీరోగా తెరకెక్కిన 'సైతాన్‌ కా బచ్చా', "సంగ తమీజన్" , కడాసి విడాసై అనే తమిళ చిత్రంలో నటిస్తున్నారు.

అయితే.. తాజాగా ఈ భామకు మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చిందట. మెగాహీరో సాయిధరమ్‌ తేజ్‌, దర్శకుడు సుకుమార్‌ కాంబోలో ఓ సినిమా నిర్మిస్తున్నారు. సుకుమార్‌ శిష్యుడు ఈ సినిమాకు దర్శకుడు.

సరికొత్త జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందట. కాగా.. మెగా హీరో సాయితేజ్‌, రాశీ ఖన్నా కాంబోలో సుప్రీం, ప్రతిరోజూ పండగే సినిమాలు సూపర్‌ హిట్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia