“శ్రీ హనుమత్ జయంతి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. శ్రీ రాముడికి పరమ భక్తుడు, అపార బలం, జ్ఞానం, ధైర్యానికి ప్రతీక అయిన శ్రీ హనుమంతుడు జన్మించిన రోజుగా భావించే ఈరోజు పరమ పవిత్రమైనది.
శ్రీ హనుమంతుడిని కొలవడం ద్వారా భయాలు తొలగుతాయని, ధైర్యం, ఆరోగ్యం కలుగుతాయని, కష్టాలు తగ్గుతాయని భక్తుల నమ్మకం.
ఆ స్వామి మీ జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని కోరుకుంటూ మరొక్క మారు శుభాకాంక్షలు తెలుపుతున్నాను” అని చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

