నేను ముందే చెప్పాను.విజయ్‌తో నన్ను పోల్చుకుంటే అది నాకు మంచిది కాదు, చెడ్డ పేరే వస్తుంది. చిన్నప్పటి నుంచీ అతన్ని చూస్తూ ఉన్నాను.
అతను సీఎం అవ్వడంలో నాకు అసూయ ఎందుకు?
ఇంకా ఇంత చిన్న వయసులో, 52 ఏళ్లకే MGR, ఎన్టీఆర్ సాధించిన వాటికంటే ఎక్కువ సాధించాడు.
సెంట్రల్ లో బీజేపీ శక్తివంతమైనది! ఇక్కడ రెండు పెద్ద పార్టీలను ఎదిరించి ఒంటరిగా వచ్చి గెలిచారు. అదీ మన సినిమా ఇండస్ట్రీ నుంచి,నాకు అసూయ కాదు! ఆశ్చర్యంతో కూడిన ఆనందం. కాబట్టి అసూయ ఏమీలేదు.
విజయ్ పై చాలా అంచనాలు ఉన్నాయి. తప్పకుండా ఆ అంచనాలన్నింటినీ అతను నెరవేర్చి ప్రజలకు మంచి చేస్తాడని నాకు నమ్మకం ఉంది. అతనికి నా శుభాకాంక్షలు అని సూపర్ స్టార్ రజనీకాంత్ సోషల్ మీడియా ద్వారా తెలిపారు.

