బాహుబలి తర్వాత సాహోతో అందరిని అలరించిన హీరో రెబల్ స్టార్ ప్రభాస్. ఇప్పుడు రాధేశ్యామ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం కేజీఎఫ్ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో సినిమా చేస్తున్నాడు. ప్రభాస్, ప్రశాంత్ కాంబోలో రానున్న సినిమాకు సలార్ పేరును ఫిక్స్ చేశారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్, విలన్ పాత్రధారులను వెతకడం కష్టం అయిపోయింది. ప్రభాస్ స్థాయికి తగ్గా హీరోయిన్, విలన్ అంటే బాలీవుడ్, టాలీవుడ్‌లలో చాలా అరుదుగా ఉన్నారు. దాంతో ఈ పాత్రల కోసం నటులను వెతకడం దర్శకనిర్మాతలకు తలనొప్పిగా మారింది. అయితే సలార్ సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా రూపొందించనున్నారు. దీనిని తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కించనున్నారు.

