తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్‌లో ఆసక్తికరమైన ఫలితాలు వస్తున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో అనూహ్యంగా దళపతి విజయ్ పార్టీ ముందంజ లో వుంది.
తమిళనాడు అసెంబ్లీ లో 234 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి . ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే ఏ పార్టీకైనా 118 స్థానాలు రావాలి . అయితే ప్రస్తుతం విజయ్ పార్టీకి అన్ని పార్టీలకన్నా 110 స్థానాల్లో ముందంజ లో ఉంది.
అధికారంలో వున్న డి .ఎమ్ .కె 60 స్థానాల్లో , అన్నా డి. ఎం .కె . 44 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి . 2024 ఫిబ్రవరి 2న విజయ్ తమిళగ వెట్రి కళగం (టి .వి .కె ) అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించాడు. 51 ఏళ్ల విజయ్ బాల నటుడుగా ‘వెట్రి ‘ అనే సినిమాతో పరిచయమయ్యాడు .
1992లో ‘నాలైయా తీర్పు’ తో తండ్రి ఎస్. ఏ .చంద్రశేఖర్ దర్శకత్వంలో తల్లి శోభ నిర్మించింది . ఆ తరువాత హీరోగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు .
తమిళ ప్రేక్షకులకు దళపతి విజయ్ గా ప్రసిద్దికెక్కాడు. తన తండ్రి ఉపదేశంలో రాజకీయాల్లోకి వచ్చినట్టు చెప్పే విజయ్ తమిళనాట ప్రభంజనం సృష్టిస్తానని ప్రకటించాడు.
విజయ్ కు జోడిగా అనేక చిత్రాల్లో నటించిన త్రిష కూడా యత్నానికి మద్దతు ఇచ్చింది. ఈరోజు ఫలితాలు ప్రకటిస్తారని తెలిసి త్రిష తిరుపతికి వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వచ్చింది .
విజయ్, త్రిష ఇరువురు కలిసి ‘ఘిల్లి’, ‘తిరుపాచ్చి’, ‘ఆది’, ‘కురువి’ వంటి సూపర్ హిట్ చిత్రాలలో నటించారు.15 ఏళ్ల తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘లియో’ (2023) చిత్రంతో ఈ జంట మళ్ళీ కలిసి నటించారు. ఈ సినిమాతో వీరు చాలా దగ్గరైనట్టు తెలుస్తుంది.
తమిళనాట మళ్ళీ డి .ఎమ్ .కె . అధికారంలోకి వస్తుందని చాలా సర్వేలు ప్రకటించాయి . అవి ముఖ్యమంత్రి స్టాలిని స్టాలిన్ , అతని కుమారుడు మంత్రి ఉదయ్ స్టాలిన్ కనుసన్నల్లో పనిచేశాయని చెప్పుకుంటారు.
అయితే ప్రస్తుత ప్రభుత్వం పట్ల తమిళ ఓటర్లు అసంతృప్తితో వున్నారని ఈసారి వారు అన్నా డి .ఎమ్ .కె .ను గెలిపించవచ్చునని మరి కొన్ని సర్వే సంస్థలు ప్రకటించాయి . అయితే ఒకే ఒక సంస్థ మాత్రం విజయ్ టి .వి .కె పార్టీ కి ఎక్కువ స్థానాలు వస్తాయని చెప్పింది .
దళపతి విజయ్ మాత్రం విజిల్ వేసి మరీ తాము అధికారంలోకి వస్తామని ప్రకటించాడు . ఇప్పుడు అతని నమ్మకమే నిజమవుతుంది .
ప్రస్తుతం తమిళనాడు పోలీసులు విజయ్ ఇంటి వద్ద , టీవీకే కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. దీనిబట్టి జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ అధికారంలోకి వస్తున్నట్టు తెలుస్తుంది.

