Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తమిళనాడులో ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్

తమిళనాడులో ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్

NAVYA MEDIA 5 days ago

మిళనాడులో నటుడు విజయ్ టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.

ఇటీవల జరిగిన ఎన్నికల ఓటమి తర్వాత పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశమైన స్టాలిన్, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై తన అంచనాలను వివరించారు.

ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో టీవీకేకు 107, దాని మిత్రపక్షమైన కాంగ్రెస్‌కు 5 సీట్లు ఉన్నాయి. డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే, సీపీఐ, సీపీఎం, ఐయూఎంఎల్‌కు చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బయటి నుంచి ప్రభుత్వానికి మద్దతిస్తున్నారు.

వీటికి తోడు, గత వారం జరిగిన విశ్వాస పరీక్షలో ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేసిన 25 మంది అన్నాడీఎంకే రెబల్ ఎమ్మెల్యేల మద్దతు కూడా విజయ్ ప్రభుత్వానికి ఉంది. అయితే, ఈ సమీకరణాలు ఎంతకాలం నిలుస్తాయనే దానిపై డీఎంకే సందేహం వ్యక్తం చేసింది.

బయటి నుంచి మద్దతిస్తున్న పార్టీలు వైదొలిగినా, రెబల్ ఎమ్మెల్యేలపై స్పీకర్ లేదా కోర్టు అనర్హత వేటు వేసినా ప్రభుత్వానికి రాజకీయ అస్థిరత తప్పదని ఆ పార్టీ భావిస్తోంది.

స్టాలిన్ తన పార్టీ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడుతూ “ఈ ఓటమి తాత్కాలికమే. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చు. సిద్ధంగా ఉండండి. 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు మళ్లీ అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. మనం తిరిగి పుంజుకుని మళ్లీ గెలుస్తాం” అని ధీమా వ్యక్తం చేశారు.

ఓటమికి తానే పూర్తి బాధ్యత వహిస్తున్నానని, కోలత్తూరులో తన ఓటమిని కూడా అంగీకరిస్తున్నానని తెలిపారు. “తమిళనాట సూర్యుడు (డీఎంకే గుర్తు) అస్తమించడు” అని ఆయన వ్యాఖ్యానించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia