Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలో డయల్ 100 స్థానంలో ఒకే ఒక్క ఎమర్జెన్సీ నంబర్ '112' అందుబాటులోకి  వచ్చింది

తెలంగాణలో డయల్ 100 స్థానంలో ఒకే ఒక్క ఎమర్జెన్సీ నంబర్ '112' అందుబాటులోకి వచ్చింది

NAVYA MEDIA 1 week ago

తెలంగాణలో 'డయల్ 100' స్థానంలో సరికొత్త సింగిల్ ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నంబర్ '112' (Dial 112) అధికారికంగా అందుబాటులోకి వచ్చింది.

నేడు (ఆగస్టు 5, 2026) రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ హైదరాబాద్‌లో ఈ నూతన ఎమర్జెన్సీ కాల్ సెంటర్‌ను ప్రారంభించారు.

ప్రజలు తమ అత్యవసర సమయాల్లో వేర్వేరు నంబర్లను గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేకుండా, అన్ని రకాల విపత్తు సేవలను ఒకే గొడుగు కిందికి తీసుకురావాలనే లక్ష్యంతో ఈ మార్పు చేశారు.

ఒకే నంబర్ – అన్ని అత్యవసర సేవలుపోలీస్ సేవలు. గొడవలు, దొంగతనాలు, శాంతిభద్రతల సమస్యలు. మంటలు లేదా ఫైర్ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు.

తక్షణ రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య అత్యవసర పరిస్థితులు.మహిళలు, వేధింపులు లేదా ఇతర రక్షణ సంబంధిత ఫిర్యాదులు.

ఈ సరికొత్త వ్యవస్థ ద్వారా ఒకేసారి ఏకకాలంలో 960 కాల్స్‌ను స్వీకరించేలా సామర్థ్యాన్ని పెంచారు. దీనివల్ల గతంలో లైన్లు బిజీగా రావడం వంటి సమస్యలు తగ్గి, బాధితులకు వేగంగా సహాయం అందుతుంది.

స్థానిక భాష (తెలుగు) తో పాటు హిందీ, ఇంగ్లీష్ భాషల్లో మాట్లాడే ప్రతినిధులు అందుబాటులో ఉంటారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia