Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు శుభవార్త: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

NAVYA MEDIA 1 week ago

తెలంగాణలోని నిరుద్యోగ యువతకు త్వరలోనే కాంగ్రెస్ ప్రభుత్వం మరికొన్ని కొత్త నోటిఫికేషన్లతో శుభవార్త అందించనుందని రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు.

ఖమ్మం జిల్లా ఏదులాపురంలో నిర్వహించిన ‘ప్రజా దర్బార్’ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఉద్యోగ నియామకాలపై ఈ కీలక వ్యాఖ్యలు చేశారు.

పలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి త్వరలోనే వరుసగా ఉద్యోగ నియామక ప్రకటనలు వెలువడనున్నాయి.

ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకునే నిరుద్యోగ అభ్యర్థులు, యువత ఇప్పుడే తమ ప్రిపరేషన్‌తో సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్యను నిర్మూలించడానికి, ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పనపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందని ఆయన స్పష్టం చేశారు.

అర్హత కలిగిన ప్రతి అభ్యర్థికి న్యాయం జరిగేలా పారదర్శకమైన పద్ధతిలో రిక్రూట్‌మెంట్ చేపడతామని ఆయన హామీ ఇచ్చారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia