Dailyhunt
టీజీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తులకు ఫైన్ లేకుండా గడువు అవకాశం ఇవాళ్టితో పూర్తి కానుంది

టీజీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తులకు ఫైన్ లేకుండా గడువు అవకాశం ఇవాళ్టితో పూర్తి కానుంది

NAVYA MEDIA 1 week ago

టీజీ ఈఏపీసెట్ - 2026 దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. ఫైన్ లేకుండా ఈ గడువు ఇవాళ్టితో (ఏప్రిల్ 4) పూర్తి కానుంది. అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు.

రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ ఈఏపీసెట్ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే దరఖాస్తులకు గడువు దగ్గరపడింది.

ఎలాంటి ఫైన్ లేకుండా ఇవాళ్టి వరకే (ఏప్రిల్ 4) అవకాశం ఉంది. ఈ తేదీ దాటితే నిర్దేశించిన ఫీజుతో పాటు ఆలస్య రుసుం కూడా చెల్లించాలి. కాబట్టి అర్హులైన విద్యార్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని అదికారులు సూచిస్తున్నారు.

ఈ ఎంట్రెన్స్ ఎగ్జామ్ ద్వారా 2026 -2027 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు కల్పిస్తారు. ఫైన్ తో అయితే మే 2వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు.

ఇప్పటికే పలు జిల్లాల్లో పరీక్షా జోన్‌లను ఎంచుకునే అవకాశం లేకుండా పోయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 16 టెస్ట్ జోన్లు ఉండగా 10కిపైగా జోన్లు ఇప్పటికే నిండిపోయాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia