ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా సెకండ్ వేవ్.. మరికొన్ని దేశాల్తో థర్డ్ వేవ్ ప్రజలు, ప్రభుత్వాల్లో వణుకుపుట్టిస్తోంది. మరోవైపు కరోనా వ్యాక్సిన్ కోసం రకరకాల పరిశోధనలు కొనసాగుతూనే ఉన్నాయి.. ఇప్పటికే కొన్ని విడుదలైనా.. అందుబాటులోకి రాలేదు. భారత్‌లోనూ కోవిడ్‌కు చెక్ పెట్టేందుకు వ్యాక్సిన్ సిద్ధమవుతోంది.. ఇప్పటికే సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ప్రధాని మోడీ.. వ్యాక్సిన్‌పై సీఎంలతో చర్చించారు. ఇక, ఒకవేళ కోవిడ్ టీకా సిద్ధమైతే, అప్పుడు తొలి దశలో సుమారు 30 కోట్ల మంది భారతీయులకు ఆ టీకాను ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్టు సమాచారం.. దీనిపై భారత ప్రభుత్వం ప్లాన్ సిద్ధం చేస్తోంది. ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌ను కోవిడ్ వారియర్స్‌కు ముందుగా ఇవ్వాలనే నిర్ణయానికి రాగా..

