తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నివాసం వద్ద బోరుగడ్డ అనిల్ కుమార్ తన భార్యతో కలిసి నిరసనకు దిగడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
వైఎస్ జగన్‌ను కలిసేందుకు అనుమతి నిరాకరించడంతో ఆయన ఈ ధర్నాకు దిగారు. వైకాపా సీనియర్ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి తనను జగన్ ఇంటికి వెళ్లకుండా, తన అనుచరులతో కలిసి కావాలనే అడ్డుకుంటున్నారని బోరుగడ్డ అనిల్ ఆరోపించారు.
సజ్జల తన అనుచరుల ద్వారా తనను ‘రౌడీషీటర్’ అని తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. తనపై ఎలాంటి రౌడీషీట్ లేదని హైకోర్టు స్పష్టం చేసినా, తనను ఎగతాళి చేసిన వారికి నోటీసులు ఇచ్చామని ఆయన తెలిపారు.
తప్పుడు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.”నన్ను వాడుకుని వదిలేశారు”పార్టీ కోసం కష్టపడ్డా. తాను లండన్‌లో పీజీ చదివి, తండ్రి మరణం తర్వాత ఇక్కడికి వచ్చి జగన్ కోసం ఎంతో కష్టపడ్డానని అనిల్ పేర్కొన్నారు.
వైఎస్సార్ సమాధి వద్దకు వెళ్లి జగన్‌ను సీఎం చేస్తానని ప్రమాణం కూడా చేశానని గుర్తుచేశారు.
తనను రాజకీయంగా వాడుకుని వదిలేశారని, వైసీపీకి తనకు సంబంధం లేదని కొందరు నాయకులు అనడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
గతంలో అనిల్ తనను వైసీపీ నేతగా చెప్పుకున్న సమయంలో, అతనితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్‌సీపీ ఇప్పటికే అధికారికంగా స్పష్టం చేసింది.

