Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైసీపీ రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి లభించి రెండేళ్లు పూర్తయింది: మంత్రి అచ్చెన్నాయుడు

వైసీపీ రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి లభించి రెండేళ్లు పూర్తయింది: మంత్రి అచ్చెన్నాయుడు

NAVYA MEDIA 1 week ago

వైసీపీ రాక్షస పాలన నుండి ప్రజలకు విముక్తి లభించి రెండేళ్లు పూర్తయిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు.

అమరావతి సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందని ధ్వజమెత్తారు.

2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) అహంకారానికి, రాక్షస పాలనకు చారిత్రాత్మక ముగింపు పలికారన్నారు.

గత ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ, ప్రతీకార రాజకీయాలకు పాల్పడిందని మండిపడ్డారు. ఐదేళ్ల జగన్ హయాంలో పరిశ్రమలను తరిమేసి, రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని ఆరోపించారు.

గత ప్రభుత్వం సంక్షేమం పేరుతో మహిళలను, రైతులను, యువతను పూర్తిగా వంచించిందని దుయ్యబట్టారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలో రాష్ట్రాన్ని మళ్లీ అభివృద్ధి పథంలోకి తీసుకువచ్చిందని స్పష్టం చేశారు.

భయం నీడలో బతికిన ప్రజలకు ఇప్పుడు స్వేచ్ఛా పూరిత వాతావరణం లభించిందని, కూటమి ప్రభుత్వం స్వర్ణాంధ్ర దిశగా అడుగులు వేస్తోంది, రాష్ట్రం వేగంగా ప్రగతి సాధిస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia