Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
వైస్సార్సీపీ రాజకీయ భవిష్యత్తుపై భయంతో చేసుకుంటున్న "ఆత్మావలోకన సమావేశాలు": మాంత్రి కందుల దుర్గేష్

వైస్సార్సీపీ రాజకీయ భవిష్యత్తుపై భయంతో చేసుకుంటున్న "ఆత్మావలోకన సమావేశాలు": మాంత్రి కందుల దుర్గేష్

NAVYA MEDIA 2 days ago

వైసీపీ నేతలు నిర్వహిస్తున్నవి 'ఆత్మీయ సమావేశాలు' కావు… ప్రజల తిరస్కారం, రాజకీయ భవిష్యత్తుపై భయంతో చేసుకుంటున్న 'ఆత్మావలోకన సమావేశాలు' మాత్రమే.

ఐదేళ్ల వైస్సార్సీపీ

పాలనలో కాపు కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసి, విదేశీ విద్య పథకాలను నిలిపివేసి, కాపు యువత భవిష్యత్తుతో చెలగాటమాడిన నాయకులకు నేడు కాపు సమాజం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు.

పిఠాపురం ప్రజలు ఘన విజయం అందించిన జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేయడం వైసీపీ నేతల రాజకీయ నిరాశకు నిదర్శనం.

ప్రజాస్వామ్యంలో ఎక్కడినుంచైనా పోటీ చేసే హక్కు ప్రతి నాయకుడికీ ఉంది, ప్రజల ఆశీర్వాదంతోనే పవన్ కళ్యాణ్ గారు చారిత్రాత్మక విజయాన్ని సాధించారు.

కార్యకర్తలను గౌరవించడం జనసేన పార్టీ సిద్ధాంతం, సామాన్య కార్యకర్త కొట్టె సాయిని ఆదుకుని, నేడు ఆలయ ఛైర్మన్ స్థాయికి తీసుకువచ్చిన చరిత్ర జనసేన పార్టీది.

“దేశం, సమాజం బాగుండాలి… నన్ను కులాల చట్రంలో బంధించవద్దు” అనే పవన్ కళ్యాణ్ గారి ఉన్నత భావజాలాన్ని వక్రీకరించి రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నించడం వైసీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనం.

కులాల పేరుతో సమాజాన్ని మభ్యపెట్టే ప్రయత్నాలు ఇక సాగవు, ప్రజలు నిజాలను గమనిస్తూనే ఉన్నారు, స్వార్థ రాజకీయాల కోసం కాపు సమాజాన్ని ఉపయోగించుకోవాలని చూస్తే ప్రజలే తగిన బుద్ధి చెబుతారు అని మాంత్రి కందుల దుర్గేష్ అన్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia