Dailyhunt
వీరంకి లాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలిసిన సీఎం చంద్రబాబు

వీరంకి లాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలిసిన సీఎం చంద్రబాబు

NAVYA MEDIA 2 weeks ago

“మేడే సందర్భంగా కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం వీరంకి లాకు గ్రామంలో భవన నిర్మాణ కార్మికులను కలిసి వారి కష్టాలు తెలుసుకున్నాను.

కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరూ శ్రామికులే.

వారి సంక్షేమం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది.

అన్న క్యాంటీన్లు, ఆటో డ్రైవర్ సేవలో, మత్స్యకారుల సేవలో వంటి అనేక పథకాలు వారికి అందిస్తున్నాం. వివిధ రంగాల్లో కార్మికులకు ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలు కల్పించాలని నిర్ణయించాం.

శ్రామికుల కష్టాన్ని గుర్తించి రాష్ట్రంలో 15 నగరాల్లో లేబర్ అడ్డాల నిర్మాణం చేపడుతున్నాం.

శ్రామికుల ఆరోగ్యంపై శ్రద్ధ పెడుతూ రాష్ట్రంలోని 6 చోట్ల ఈఎస్ఐ ఆస్పత్రుల నిర్మాణం చేస్తున్నాం. 2024లో ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతీ నెలా పేదల సేవలో కార్యక్రమం ద్వారా లబ్దిదారులకు పెన్షన్ అందిస్తున్నాను.

1వ తేదీన పెన్షన్ అందుకుంటున్న లబ్దిదారుల కళ్లలో సంతోషం కనిపిస్తోంది.

పమిడిముక్కల గ్రామంలో తలసేమియా బాధితుడికి పెన్షన్ అందించాను అని సీఎం చంద్రబాబు సోషల్ మీడియా ద్వారా చంద్రబాబు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia