Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
విశాఖపట్నాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాము విశాఖ ఎంపీ శ్రీభరత్

విశాఖపట్నాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నాము విశాఖ ఎంపీ శ్రీభరత్

NAVYA MEDIA 3 weeks ago

విశాఖపట్నంను అంతర్జాతీయ స్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు, రాష్ట్రాభివృద్ధే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం విశాఖ ఎంపీ శ్రీభరత్ నేతృత్వంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను ముమ్మరం చేసింది.

కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష నిర్వహించేందుకు దిశ సమావేశం ఒక మంచి వేదికగా నిలుస్తోందని విశాఖ ఎంపీ శ్రీభరత్ అన్నారు.

దిశ సమావేశంలో 33 విభాగాలకు చెందిన అధికారులతో పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించినట్లు తెలిపారు.

అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్న విశాఖపట్నాన్ని అధికారులు, ప్రజాప్రతినిధుల సమన్వయంతో మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్నామని ఆయన పేర్కొన్నారు.

విశాఖ నగరంలో మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి కోసం ప్రతిపాదించిన రూ.1,500 కోట్ల విలువైన మూడు కీలక ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వ నేషనల్ అపెక్స్ కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అర్బన్ ఛాలెంజ్ ఫండ్ (UCF) కింద ఈ నిధులు మంజూరయ్యాయి.

మధురవాడ జోన్‌లో అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, తాగునీటి సరఫరా, నగర నీటి పంపిణీ వ్యవస్థ బలోపేతం వంటి కీలక ప్రాజెక్టులు చేపడుతున్నామని చెప్పారు. ఈ ప్రాజెక్టుల పురోగతిపై దిశ సమావేశంలో సమీక్షించినట్లు తెలిపారు.

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విశాఖలో అభివృద్ధి పనులు మందగించాయని, అనేక కీలక ప్రాజెక్టులు పక్కనపెట్టబడటంతో వాటి వ్యయం ప్రస్తుతం భారీగా పెరిగిందని శ్రీభరత్ విమర్శించారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా నిలిచిపోయిన ప్రాజెక్టులను ఇప్పుడు కొత్త పథకాల ద్వారా తిరిగి ముందుకు తీసుకువస్తున్నామని తెలిపారు.

విశాఖ నగరంలో డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధి కోసం మరోసారి అర్బన్ చాలెంజ్ ఫండ్ కింద ప్రతిపాదనలు సమర్పిస్తున్నామని చెప్పారు.

విశాఖ బీచ్‌లలో లభించే ఖనిజ సంపదను త్వరలో వినియోగంలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు.

ఎమ్మెల్యే గణబాబు మాట్లాడుతూ, దిశ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై సమగ్ర సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు.

ప్రతి అంశాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించామని, విశాఖ అంతర్జాతీయ గుర్తింపు పొందే దిశగా వేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారని, ప్రతి మూడు నెలలకు ఒకసారి దిశ సమావేశాలు నిర్వహించడం వల్ల అభివృద్ధి కార్యక్రమాల అమలులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని గణబాబు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: Navyamedia