“అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం హైదరాబాదులోని పరేడ్ మైదానంలో నిర్వహించిన 24 గంటల ముందస్తు కౌంట్‌డౌన్ మహోత్సవంలో పాల్గొనడం ఆనందంగా ఉంది.
యోగ అనేది కేవలం శారీరక ఆసనాలకే కాదు; అంతర్గత శక్తిని మేల్కొలిపే జీవన వేదం. ఈ ఏడాది ఇతివృత్తం “ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా” నేటి సమాజానికి ఎంతో అవసరం. యోగ మతాతీతమైన ఒక అద్భుత ఆరోగ్య శాస్త్రం.
నేటి యువత ఈ యోగ్యతను అందిపుచ్చుకుని నిత్య జీవితంలో భాగం చేసుకోవాలని ఆకాంక్షిస్తున్నాను”.
వెంకయ్య నాయుడు సోషల్ మీడియాలో ట్వీట్ చేసారు.

