తెలంగాణ
బిజెపిలో చేరుతున్నట్లు సర్వే సత్యనారాయణ ప్రకటన

బిజెపిలో చేరుతున్నట్లు సర్వే సత్యనారాయణ ప్రకటన
తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. ఈరోజు సర్వే నివాసానికి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్ వెళ్లి, పార్టీలో చేరాలని ఆయనను ఆహ్వానించారు. అనంతరం మీడియాతో సర్వే మాట్లాడుతూ, తాను బీజేపీలో చేరుతున్నానని ప్రకటన చేశారు.గత ఐదు, ఆరు నెలలుగా బీజేపీ నేతలు, ఆ పార్టీ కేంద్ర నాయకత్వం తనను సంప్రదిస్తోందని చెప్పారు. బీజేపీలో చేరడానికి ఇదే సరైన సమయమని అన్నారు. త్వరలోనే తాను ఢిల్లీకి వెళ్లి బీజేపీ హైకమాండ్ సమక్షంలో కాషాయ కండువా కప్పుకుంటానని చెప్పారు. పార్టీ హైకమాండ్ తో చర్చించిన తర్వాత తాను ఏమి చేస్తానో చెపుతానని అన్నారు. మరి కొందరు కాంగ్రెస్ నేతలు కూడా బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.
related stories
-
హోమ్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
-
ప్రధాన వార్తలు 'దేశంలో కోరుకుంటున్న మార్పును ప్రభుత్వం చేసింది'
-
ఆంధ్ర ప్రదేశ ముఖ్యాంశాలు పంచాయతీ ఎన్నికలకు మేము సిద్ధం: ఎమ్మెల్సీ మాధవ్