Tuesday, 02 Jun, 12.58 pm News Bazar9

జాతీయం
ఏడు రాష్ట్రాల్లో మొదలైన ఎన్నికల సందడి

దేశంలో మళ్ళీ ఎన్నికల సందడి మొదలైంది.కరోనా వైరస్ కారణంగా వాయిదా పడ్డ రాజ్యసభ ఎన్నికలకు ఈసీ మళ్లీ షెడ్యూల్ ప్రకటించింది. మొత్తం 18 స్థానాలకు ఈ నెల 19న ఓటింగ్ నిర్వహించనుంది ఈసీ. ఫలితాలు కూడా అదే రోజు వెల్లడవుతాయి. కరోనా లాక్‌డౌన్ నిబంధలను నెమ్మది నెమ్మదిగా సడలించడంతో రాజ్యసభ పెండింగ్ ఎన్నికలపై దృష్టి సారించింది కేంద్ర ఎన్నికల సంఘం. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే 17 రాష్ట్రాల్లో ఖాళీ అవుతున్న 55 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది ఈసీ. వాటిలో పది రాష్ట్రాల్లో 37 స్థానాలు ఏకగ్రీవడం కావడంతో మిగిలిన సీట్లకు ఎన్నికలు అనివార్యమయ్యాయి. మార్చి 26నే ఈ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా. కరోనా ఎఫెక్ట్‌తో అవి వాయిదా పడ్డాయి.రెండు నెలల తర్వాత ఆంక్షలను సడలించడంతో ఎన్నికల ప్రక్రియను మళ్లీ మొదలు పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం.స్పాట్ ఈ నెల 19న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు రాజ్యసభ ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. సాయంత్రం 5 గంటలకు ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను వెల్లడిస్తారు. ఏపీలో నాలుగు స్థానాలు, గుజరాత్‌లో నాలుగు, మధ్యప్రదేశ్‌లో మూడు సీట్లు, రాజ్యసభలో మూడు , జార్ఖండ్‌లో రెండు , మణిపూర్, మేఘాలయ రాష్ట్రాల్లో ఒక్కో స్థానానికి ఎన్నికలు జరుగుతాయి. స్పాట్ ఏపీలో అధికార వైసీపీ నుంచి పిల్లి సుభాష్ చంద్రబోస్, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పరిమళ్ నత్వాని అభ్యర్థులుగా బరిలో ఉన్నారు. టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీలో నిలిచారు. టీడీపీ తమ అభ్యర్థిని దించకుంటే ఏపీలోనూ ఎన్నికలు ఏకగ్రీవమయ్యేవి.

Dailyhunt
Disclaimer: This story is auto-aggregated by a computer program and has not been created or edited by Dailyhunt. Publisher: News Bazar9
Top
// // // // $find_pos = strpos(SERVER_PROTOCOL, "https"); $comUrlSeg = ($find_pos !== false ? "s" : ""); ?>