టీడీపీ ఎమ్మెల్యే పరిటాల సునీతపై వైసీపీ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ అరాచకాలు తీవ్ర స్థాయికి చేరాయని, తనను చంపేందుకు టీడీపీ ఎమ్మెల్యేలు పరిటాల సునీత, అమిలినేని సురేంద్ర బాబు కుట్ర పన్నారని అన్నారు.
శింగనమల వద్ద తన వాహనాన్ని ఢీకొని హత్య చేసేందుకు కుట్ర జరిగిందని, తన డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రమాదం తప్పిందన్నారు. తన వాహనం పైకి దూసుకొచ్చింది టీడీపీ ఎమ్మెల్యే అమిలినేని సురేంద్ర బాబు కు చెందిన టిప్పర్ అని తోపుదుర్తి ఆరోపించారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.
కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తనకు గన్ మెన్లు తొలగించారని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అన్నారు. తన సోదరుడు తోపుదుర్తి రాజా పై అక్రమ కేసులు బనాయించి జైలుకు పంపారన్నారు.

