Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'

ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు సూర్య 'విశ్వనాథ్ అండ్ సన్స్'

సూర్య కథానాయకుడిగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'విశ్వనాథ్ అండ్ సన్స్' విడుదల తేదీ ఖరారైంది. ఈ చిత్రాన్ని ఆగస్టు 14, 2026న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

స్వాతంత్య్ర దినోత్సవ లాంగ్ వీకెండ్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదల కానుంది.

ఈ ఏడాది ప్రారంభంలో సూర్య కెరీర్‌లోనే అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచిన 'కరుప్పు' భారీ విజయం సాధించిన తర్వాత వస్తున్న సినిమా కావడంతో, 'విశ్వనాథ్ అండ్ సన్స్'పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇటీవల విడుదలైన టీజర్ ద్వారా 40 ఏళ్ల వయసులో తన కలలను సాకారం చేసుకునే దిశగా అడుగులేస్తున్న అంతర్జాతీయ పిస్టల్ షూటర్ సంజయ్ విశ్వనాథ్ పాత్రను పరిచయం చేశారు. తండ్రి ప్రేమకు, భావోద్వేగాలకు ప్రాధాన్యతనిచ్చే పాత్రలో సూర్య కనిపించనున్నారు. ఆగస్టు 14న సినిమాను విడుదల చేయడం ద్వారా లాంగ్ వీకెండ్‌లో కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా మేకర్స్ వ్యూహరచన చేశారు. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తమ సోషల్ మీడియా ఖాతాల ద్వారా ఈ అధికారిక ప్రకటన చేసింది. 'ప్రేమలు' సినిమాతో విశేష గుర్తింపు తెచ్చుకున్న మమితా బైజు ఇందులో ఓ ఆసక్తికరమైన కీలక పాత్ర పోషిస్తోంది. ఇంకా ఈ చిత్రంలో రవీనా టాండన్, రాధికా శరత్‌కుమార్, భవానీ శ్రీ, బ్జోర్న్ సుర్రావ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu