Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అక్కడికి వెళ్లకుండా.. మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్ట్..!

అక్కడికి వెళ్లకుండా.. మాజీ మంత్రి హరీశ్‌రావు హౌస్ అరెస్ట్..!

తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్‌ఎల్పీ ఉప నేత టి. హరీశ్‌రావును పోలీసులు హైదరాబాద్‌లోని కోకాపేటలో గల ఆయన నివాసంలో హౌస్ అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లాలో సమస్యలు ఎదుర్కొంటూ ఆందోళన బాట పట్టిన పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తుండగా, పోలీసులు ఆయన్ను నివాసం వద్దే అడ్డుకుని బయటకు రాకుండా నిలిపివేశారు.

హరీశ్‌రావు పర్యటన నేపథ్యంలో ఉదయం నుంచే ఆయన ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు, ప్రధాన ద్వారం వద్ద బారికేడ్లు ఏర్పాటు చేసి నాయకులు, కార్యకర్తలను లోపలికి అనుమతించలేదు. విద్యార్థుల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు వెళ్తుంటే ముందస్తుగా గృహనిర్బంధం చేయడంపై హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో శాంతియుతంగా సమస్యలను లేవనెత్తే హక్కును కాంగ్రెస్ ప్రభుత్వం కాలరాస్తోందని, నిరంకుశంగా విపక్షాల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. అరెస్టులతో ప్రజా సమస్యలపై పోరాటాన్ని ఆపలేరని ఆయన స్పష్టం చేశారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu