పాన్-ఇండియా సెన్సేషన్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మరో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. ప్రముఖ అంతర్జాతీయ మ్యాగజైన్ 'ఫోర్బ్స్ ఇండియా' (Forbes India) ప్రత్యేక సంచిక కవర్ పేజీపై మెరిశారు.
2025 జనవరి నుంచి 2026 మార్చి వరకు సినిమాలు, ఓటీటీ, క్రీడలు, సంగీతం, టెలివిజన్ వంటి వివిధ రంగాల్లో విశేష ప్రభావం చూపిన 100 మంది తారల జాబితాను 'షో స్టాపర్స్ - 2026' పేరుతో ఫోర్బ్స్ ఇండియా తాజాగా విడుదల చేసింది. దేశవ్యాప్తంగా తనకున్న క్రేజ్‌ను చాటుకుంటూ ఈ ప్రతిష్టాత్మక లిస్ట్‌లో బన్నీ స్థానం దక్కించుకున్నారు.
ఈ జాబితాలో అల్లు అర్జున్‌తో పాటు టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్, దిగ్గజ నటులు అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, మోహన్ లాల్, షారుక్ ఖాన్, ఆమిర్ ఖాన్, అక్షయ్ కుమార్, ఏఆర్ రెహమాన్, బాబీ డియోల్, దుల్కర్ సల్మాన్, మాధవన్, రణ్‌వీర్ సింగ్, రిషబ్ శెట్టి, కల్యాణి ప్రియదర్శన్, కంగనా రనౌత్ తదితరులు చోటు దక్కించుకున్నారు. ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ చిత్రంలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబయిలో శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో బన్నీ సరసన బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించనున్నారని, అలాగే మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, రష్మికా మందన్నా కూడా భాగం కానున్నారనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

