Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా 14 ఏళ్ల భారత సంతతి కుర్రాడు శ్రేయ్ పారిఖ్!

అమెరికా స్పెల్లింగ్ బీ విజేతగా 14 ఏళ్ల భారత సంతతి కుర్రాడు శ్రేయ్ పారిఖ్!

అమెరికాలో అత్యంత ప్రతిష్టాత్మకమైన, అతిపెద్ద విద్యా పోటీ 'స్క్రిప్స్ నేషనల్ స్పెల్లింగ్ బీ' (Scripps National Spelling Bee) టైటిల్‌ను ఈ ఏడాది కూడా భారత సంతతి విద్యార్థే కైవసం చేసుకున్నాడు.

కాలిఫోర్నియాలోని రాంచో కుకమోంగాకు చెందిన 14 ఏళ్ల శ్రేయ్ పారిఖ్.. వాషింగ్టన్ డీసీలో జరిగిన ఫైనల్స్‌లో తోటి ఫైనలిస్ట్ ఇషాన్ గుప్తాపై ఉత్కంఠభరితమైన 'లైట్నింగ్-రౌండ్ టైబ్రేకర్' (spell-off) లో గెలిచి విజేతగా నిలిచాడు. నిర్ణీత 90 సెకన్ల వ్యవధిలో శ్రేయ్ ఏకంగా 32 పదాలను సరిగ్గా పలికి ఛాంపియన్‌గా నిలవగా, ఇషాన్ 25 పదాలను మాత్రమే సరిగ్గా పలికాడు.

గతంలో 2024లో మూడో స్థానంలో నిలిచిన శ్రేయ్, గత ఏడాది జ్వరంతో స్కూల్ స్థాయిలోనే ఓడిపోయినప్పటికీ, పట్టుదలతో ఆన్‌లైన్ పోటీల్లో రాణిస్తూ చివరకు ఈ మెగా టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు. కేవలం స్పెల్లింగ్స్ మాత్రమే కాకుండా టెన్నిస్, మ్యాథ్స్, చెస్ ఆడటంతో పాటు స్కూల్ బ్యాండ్‌లో డ్రమ్స్, మారింబా వంటి విభిన్న వాయిద్యాలను వాయించడంలో శ్రేయ్‌కు మంచి ప్రవేశం ఉంది. భారతదేశంలో ఉండే తన నానమ్మ, తాతయ్యలతో గడపడం కూడా ఈ కుర్రాడికి చాలా ఇష్టం.

ఈ పోటీల్లో భారత సంతతి విద్యార్థుల హవా కొత్తేమీ కాదు. గత కొన్ని ఏళ్లుగా అమెరికా స్పెల్లింగ్ బీ పోటీలను ఇండో-అమెరికన్లే శాసిస్తున్నారు. గత ఏడాది జరిగిన పోటీల్లో టెక్సాస్‌కు చెందిన 13 ఏళ్ల ఫైజాన్ జాకీ విజేతగా నిలవగా, 2024లో 12 ఏళ్ల బృహత్ సోమ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ ఏడాది జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో బృహత్ సోమ 90 సెకన్లలో 29 పదాలను సరిగ్గా పలికి ఫైజాన్ జాకీ (20 పదాలు) పై గెలుపొందాడు. ఆ విజయంతో బృహత్ సోమ సుమారు రూ. 41.64 లక్షల ($50,000) నగదు బహుమతితో పాటు ఇతర ప్రైజులను అందుకున్నాడు. తాజా విజయంతో శ్రేయ్ పారిఖ్ ఈ ఘనమైన వారసత్వాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లాడు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu