Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Anantapur : ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

Anantapur : ప్రియుడి మర్మాంగాన్ని కోసిన మహిళ

నంతపురంలో ఓ దారుణ ఘటన జరిగింది. ప్రియుడి మర్మాంగాన్ని కోసిన ఓ మహిళ స్వయంగా వెళ్లి పోలీసులకు లొంగిపోయింది. అనంతపురం వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డ్రైవర్స్ కాలనీలో ఈ ఘటన చోటు చేసుకుంది.

వివరాళ్లోకెళితే.. డ్రైవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న సునీతతో సురేష్ అనే వ్యక్తి వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. సునీతకు ఓ కూతురు ఉంది. సురేష్ వావివరసలు మరిచి సునీత కూతురిపై కూడా కన్నేసాడు.

ఆమె కూతురుతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. దీంతో అసహనానికి గురైన సునీత.. సురేష్ కాళ్లు, చేతులు రెండు కట్టేసి మర్మాంగాన్ని కోసేసింది. అనంతరం సునీత స్వయంగా వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయింది. సురేష్‌ను గమనించి చుట్టు పక్కలవారు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu