శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో స్థానిక ఎన్నికల నామినేషన్ల వేళ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి నామినేషన్లు దాఖలు చేసేందుకు వెళ్తున్న ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు.
వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా పోలీసుల అడ్డుకుంటున్నారని, మంత్రి సత్యకుమార్ నియోజకవర్గంలో కూటమి నేతల దౌర్జన్యాలకు పోలీసులు కొమ్ముకాస్తున్నారని కేతిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
అనంతపురం జిల్లా తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తిమ్మంపల్లిలో హౌస్ అరెస్ట్ అయ్యారు. ఎల్లనూరు మండలంలో ZPTC ,MPTC ఎన్నికల నామినేషన్ల సందర్భంగా వైసీపీ పార్టీ కార్యకర్తలు తో నామినేషన్ వేయించడానికి కేతిరెడ్డి పెద్దారెడ్డి వెళ్తుండగా తెల్లవారుజామున పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా హౌస్ అరెస్ట్ చేశారు.

