Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాక్సాఫీస్ వద్ద సమంత సినిమా వసూళ్ల సునామీ..!

బాక్సాఫీస్ వద్ద సమంత సినిమా వసూళ్ల సునామీ..!

మంత రూత్ ప్రభు నటించిన లేటెస్ట్ మూవీ 'మా ఇంటి బంగారం' ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. నందినీ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు సాధారణ బజ్ మాత్రమే ఉన్నప్పటికీ, మొదటి వారాంతంలో అద్భుతమైన కలెక్షన్లు రాబట్టి ఈ ఏడాది అతిపెద్ద సక్సెస్ స్టోరీలలో ఒకటిగా నిలిచింది.

ట్రలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై సమంత స్వయంగా రాజ్ నిడిమోరు, హిమాంక్ రెడ్డి దువ్వూరుతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ యాక్షన్ కామెడీ డ్రామాలో గుల్షన్ దేవయ్య, గౌతమి, దిగంత్ కీలక పాత్రల్లో నటించారు. విమెన్-సెంట్రిక్ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమా ఓవర్సీస్ ప్రీమియర్స్ ద్వారా $700K వసూలు చేసి, 'ఉస్తాద్ భగత్ సింగ్', 'వార్ 2' వంటి చిత్రాల ఓపెనింగ్ కలెక్షన్స్ ను అధిగమించింది. అదే ఊపును వారాంతంలో కూడా కొనసాగిస్తూ, 'మా ఇంటి బంగారం' మొదటి మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా ఏకంగా ₹38 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu