Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బాల్క సుమన్‌ అరెస్ట్‌.. తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..!

బాల్క సుమన్‌ అరెస్ట్‌.. తెలంగాణ భవన్‌ వద్ద ఉద్రిక్తత..!

మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇటీవల ప్రభుత్వ ఆస్తుల విషయంలో చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై హైదరాబాద్ నాంపల్లి పోలీసు స్టేషన్‌లో కేసు నమోదనట్లు సమాచారం.

దీంతో సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే నేడు తెలంగాణ భవన్‌కు వచ్చిన సుమన్‌ను అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది.

ఈ క్రమంలోనే తెలంగాణ భవన్ నుండి బయట వచ్చిన సుమన్ భవన్ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. నన్ను క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల తర్వాత అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేసారు.. ఇపుడు మళ్లీ అరెస్ట్ చేస్తున్నారని అన్నారు. నామీద పెట్టిన కేసులు హాస్యాస్పదం అని కొట్టిపారేశారు. సింగరేణి కుంభకోణాల మయంగా మారిపోయింది.. తొమ్మిది పది జిల్లాలకు విస్తరించిన సింగరేణిలో కార్మికులు, ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులు ఉన్నాయన్నారు. స్థానిక ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వడ్లు కొనమని అన్నందుకు అశోక్ అనే ఆర్టీసీ డ్రైవర్ ను వేధించారు.. వడ్లు, మక్కలు కొనమంటే కేసులు పెడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. మాకు చట్టంపై గౌరవం ఉంది.. నేను ఎక్కడికి పారిపోలేదు.. భవన్ లోనే ఒక యాప్ తయారీలో భాగంగా ఇక్కడే ఉన్నా.. మమ్మల్ని జైలుకు పంపించే విషయంలో ఉన్న తాపత్రయం.. మీ హామీలపై చూపించండి.. ప్రజలకు మేలు చేయండి. జైళ్లు మాకు కొత్తకాదు.. సత్యమేవ జయతే.. అంటూ ముగించారు.

మీడియాతో మాట్లాడిన అనంతరం సుమన్ పోలీసులకు లొంగిపోయారు. తెలంగాణ భవన్ వద్ద అప్పటికే మోహరించిన పోలీసులు సుమన్‌ను అదుపులోకి తీసుకున్నారు. నోటీసు ఇచ్చి తీసుకెళ్తామని..అరెస్ట్ విషయం ఇప్పుడే చెప్పలేమని అంతకుముందు నాంపల్లి ఏసీపీ తెలిపారు.. పోలీసుల చర్యలకు అడ్డుతగలవద్దని ఏసీపీ విజ్ఞప్తి చేశారు..!

ఇదిలావుంటే.. సుమన్ వ్యాఖ్యలపై హైదరాబాద్ నాంపల్లిలోని సింగరేణి భవన్ ఎస్ అండ్ పీసీ విభాగం జూనియర్ ఇన్‌స్పెక్టర్ బీ ఆనంద్ నాంపల్లి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.. ఇదే ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు తాజాగా ఆయనను అరెస్ట్ చేసారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu