Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బంగాళాఖాతంలో రేపే అల్పపీడనం..4వ తేదీ నుంచి ఏపీలో భారీ వర్షాలు!

బంగాళాఖాతంలో రేపే అల్పపీడనం..4వ తేదీ నుంచి ఏపీలో భారీ వర్షాలు!

ఆంధ్రప్రదేశ్‌లో రాగల మూడు రోజుల్లో వాతావరణం వేగంగా మారబోతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, వాయవ్య బంగాళాఖాతం పరిసర ప్రాంతాలలో రేపు (శుక్రవారం) ఒక అల్పపీడనం ఏర్పడనున్నట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

ఈ అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత క్రమంగా పెరగనుంది. ముఖ్యంగా జూలై 4వ తేదీ నుంచి ఉత్తర కోస్తా ఆంధ్రాలోని పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఆ తర్వాత జూలై 5వ తేదీ నుంచి కోస్తాంధ్రతో పాటు రాయలసీమలోని చాలా ప్రాంతాల్లో విస్తారంగా వానలు కురుస్తాయని వాతావరణ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఒడిశా - పశ్చిమ బెంగాల్ తీరాలకు ఆనుకొని కేంద్రీకృతమయ్యే ఈ అల్పపీడన ద్రోణి, ఆ తర్వాత పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ రాజస్థాన్ వైపు పయనించే అవకాశం ఉంది. ఈ క్రమంలో తీరం వెంబడి గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉన్నందున మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ అయ్యాయి.

మరోవైపు, అల్పపీడనంతో సంబంధం లేకుండా నైరుతి రుతుపవనాల కదలికలు మరియు స్థానిక వాతావరణ మార్పుల కారణంగా ఈరోజు కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది.

ముఖ్యంగా ఉత్తర కోస్తాలోని శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, మన్యం పరిసర ప్రాంతాలతో పాటు ఉమ్మడి గోదావరి జిల్లాల్లోని పోలవరం ఏజెన్సీ పరివాహక ప్రాంతాల్లో ఈరోజు మధ్యాహ్నం లేదా సాయంత్రానికి మోస్తరు నుండి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల యంత్రాంగం ఇప్పటికే అప్రమత్తమైంది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu