Dailyhunt
భారత్‌కు ఎలాంటి ఆందోళన వద్దు.. ఇరాన్ హామీ

భారత్‌కు ఎలాంటి ఆందోళన వద్దు.. ఇరాన్ హామీ

ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్, అమెరికా దళాలు టెహ్రాన్‌పై దాడి చేసినప్పటి నుంచి, ప్రపంచంలోనే అత్యంత కీలకమైన షిప్పింగ్ మార్గాల్లో ఒకటైన 'హార్ముజ్ జలసంధి' గుండా రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

అయితే ఈ సంక్షోభం మధ్య భారత్‌కు ఇరాన్ భరోసా ఇచ్చింది. భారతీయ స్నేహితులు సురక్షితమైన చేతుల్లో ఉన్నారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భారతదేశంలోని ఇరాన్ రాయబార కార్యాలయం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.

భారతదేశం, చైనా, రష్యా, ఇరాక్ పాకిస్థాన్‌లతో సహా "స్నేహపూర్వక దేశాలకు" మాత్రమే హార్ముజ్ గుండా ప్రయాణించడానికి తాము అనుమతించినట్లు ఇరాన్ ఇదివరకే స్పష్టం చేసింది. ఇరాన్ యుద్ధ వాతావరణం మధ్య ఇప్పటి వరకు పలు భారతీయ నౌకలు హార్ముజ్ జలసంధి నుండి బయటపడ్డాయి. ఇందులో 'BW TYR', 'BW ELM' అనే రెండు LPG రవాణా నౌకలు ఉన్నాయి.అయితే, భారతదేశానికి ఎల్‌పిజి, ముడి చమురు, ఎల్‌ఎన్‌జి (LNG) ని తీసుకువస్తున్న దాదాపు 19 నౌకలు ప్రస్తుతం హార్ముజ్ జలసంధిలో చిక్కుకుపోయాయని అధికారులు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu