Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురి మృతి

బురదలో దిగబడిన కారు.. ఊపిరాడక ముగ్గురి మృతి

కర్ణాటకలోని కొడగు జిల్లా మడికెరి తాలూకా మాల్యారె పరిధిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. సిద్ధాపుర హైస్కూల్ పైసారికి చెందిన విజేశ్‌ (36), ఆయన భార్య ప్రమిత (34), చిన్న కూతురు లియ (4) ఈ దుర్ఘటనలో మృతి చెందారు.

విజేశ్ దంపతులు తమ కారులో మాల్యారెలోని బంధువుల ఇంటికి వెళ్లారు. అక్కడ తమ పెద్ద కూతురిని ఉంచి, చిన్న కూతురు లియను వెంటబెట్టుకుని తాము పనిచేస్తున్న ఎస్టేట్‌కు తిరిగి బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న మార్గంలో చెరువు కట్టపై వెళ్తుండగా, కారు అకస్మాత్తుగా అదుపుతప్పి కిందకు జారిపోయింది. చెరువులోని బురదలోకి దిగబడిపోయింది. రాత్రి సమయం కావడంతో ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ఈ ప్రమాదం బయటపడలేదు.

కారు బురదలో కూరుకుపోవడంతో అందులోని వాళ్లు బయటకు రాలేకపోయారు. కారులోనే ఊపిరాడక వారు ముగ్గురూ ప్రాణాలు వదిలారు. ఉదయం ఆ దారిన వెళ్తున్న కొందరు కార్మికులు చెరువులో కారును గమనించి, వెంటనే పోలీసులకు, స్థానికులకు సమాచారం అందించారు. కార్మికులు కారులోని వారిని బయటకు తీసి సిద్ధాపుర ఆస్పత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చె­ందినట్లు వైద్యులు ధృవీకరించారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మడికెరి ఆస్పత్రికి తరలించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu