Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
చెన్నై జైలుకు సీఎం విజయ్

చెన్నై జైలుకు సీఎం విజయ్

మిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ చెన్నైలోని పుళల్ (Puzhal) సెంట్రల్ జైలులో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఖైదీలకు అందుతున్న ప్రాథమిక సదుపాయాలు, వైద్య సంరక్షణ, భోజన నాణ్యత, వృత్తి విద్యా శిక్షణ కేంద్రాలను ఆయన పరిశీలించారు.

వారి అవసరాలను, సమస్యలను తెలుసుకునేందుకు ఖైదీలతో నేరుగా ముచ్చటించారు. దేశంలోని అతిపెద్ద జైలు సముదాయాలలో ఒకటైన ఈ జైలులో.. క్వారంటైన్ జోన్, విజిటర్స్ హాల్, జైలు ఆసుపత్రి, పునరావాస కేంద్రం, మహాత్మా గాంధీ కమ్యూనిటీ కాలేజీ తరగతి గదులు, లైబ్రరీ, ఆధునిక కంప్యూటర్ శిక్షణా కేంద్రం, హై-సెక్యూరిటీ బ్లాక్ వంటి ముఖ్యమైన విభాగాలను ఆయన తనిఖీ చేశారు.

ఖైదీలు పనిచేసే వృత్తి విద్యా వర్క్‌షాప్‌లను సీఎం సందర్శించారు. అక్కడ ఖైదీలు తయారుచేసే ర్యాక్‌లు, పేపర్ కవర్లు, ఆఫీస్ ఫైల్ ఫోల్డర్లు, దుప్పట్లు ఇతర వస్త్రాలు తయారయ్యే పవర్‌లూమ్ విభాగంతో పాటు టైలరింగ్ యూనిట్‌ను పరిశీలించారు. ఖైదీలకు వడ్డించే భోజనం నాణ్యతను ఆయన స్వయంగా తనిఖీ చేశారు. జైలు సందర్శన అనంతరం ముఖ్యమంత్రి, ఎం-3 (M-3) పుళల్ పోలీస్ స్టేషన్‌ను కూడా సందర్శించారు. ఇన్‌స్పెక్టర్‌తో కలిసి స్టేషన్ రోజువారీ కార్యకలాపాలను సమీక్షించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu