Dailyhunt
Daily Horoscope: నేడు ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టే ఛాన్స్!

Daily Horoscope: నేడు ఈ రాశి వారు కొత్త పనులకు శ్రీకారం చుట్టే ఛాన్స్!

మేషం

కొత్త పనులకు శ్రీకారం చుడతారు. ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి. స్థిరాస్తి వివాదాలు తీరతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.

వృషభం

ముఖ్య వ్యవహారాలలో ప్రతిబంధకాలు ఉంటాయి. ఆర్థిక వ్యవహారాలు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. మిత్రులతో దైవదర్శనాలు చేసుకుంటారు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు కలుగుతాయి. వ్యాపారాలు కొంత మందగిస్తాయి. ఉద్యోగాలలో అధికారులతో చికాకులు పెరుగుతాయి.

మిధునం

చాలాకాలంగా పడిన శ్రమ ఫలిస్తుంది. నూతన పనులు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. విలువైన వస్తు లాభాలు పొందుతారు. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం

ఇంటా బయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన పనులలో వ్యయప్రయాసలు అధికమవుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. ప్రయాణాలలో ఆకస్మిక మార్పులు ఉంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతుంది. ఉద్యోగ విషయమై అధికారులతో చర్చలు అనుకూలించవు.

సింహం

చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలు ఉన్నవి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో విశేషమైన గౌరవ మర్యాదలు పొందుతారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నాలు ప్రారంభిస్తారు. వ్యాపారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.

కన్య

నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. వివాదానికి సంబంధించి ప్రముఖుల నుంచి అందిన సమాచారం ఊరట కలిగిస్తుంది. ఆర్థికంగా మరింత మెరుగైన వాతావరణం ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో నష్టాల నుండి బయటపడగలుగుతారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల

చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. సన్నిహితులతో ఊహించిన వాదాలు కలుగుతాయి. దూర ప్రయాణ సూచనలున్నవి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారపరంగా కొంత మెరుగైన పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది.

వృశ్చికం

గృహమున ఆకస్మికంగా నిర్ణయాలు మార్పులు చేస్తారు. సోదరులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన ఋణాలు చేస్తారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలలో గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగాలలో ఊహించని స్థానచలన సూచనలు ఉన్నవి.

ధనస్సు

ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు అనుకూలంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాలలో మీ అంచనాలు నిజమవుతాయి.

మకరం

చేపట్టిన వ్యవహారాలలో పురోగతి సాధిస్తారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. భూవివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తుల పరిచయాలు విస్తృతం అవుతాయి. వాహనం ఉపయోగపడుతుంది. వ్యాపార వ్యవహారాలలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగాలలో సమస్యలు పరిష్కారం అవుతాయి.

కుంభం

మిత్రులతో కలహా సూచనలు ఉన్నవి. నూతన ఋణయత్నాలు సాగిస్తారు. చేపట్టిన పనుల్లో ఆటంకాలు కలుగుతాయి. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలలో కొంత గందరగోళ పరిస్థితులు ఉంటాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుండి ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి.

మీనం

కొన్ని పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు. వృధా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలు మరింత బాధిస్తాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu