మేషం:
ముఖ్యమైన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. బంధు, మిత్రుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో ఆటంకాలు తొలగి పురోగతి సాధిస్తారు.
ఉద్యోగంలో కొత్త ప్రోత్సాహకాలు లభిస్తాయి.
వృషభం:
వృత్తి, ఉద్యోగాల్లో మీ ప్రతిభ అందరి ప్రశంసలు పొందుతుంది. ఆప్తుల నుంచి కీలక సమాచారం అందుతుంది. అనుకున్న పనులు విజయవంతంగా పూర్తవుతాయి. కొత్త వ్యాపారాల విస్తరణకు అనుకూల సమయం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి ఉంటుంది.
మిథునం:
అప్పుల ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు నెమ్మదిగా సాగుతాయి. ఇతరులతో తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్తపడాలి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి, వ్యాపారాల్లో స్వల్ప ఆర్థిక నష్టాలు ఎదురవవచ్చు. ఉద్యోగంలో అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సంతానం ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
కర్కాటకం:
కుటుంబ విషయాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. ప్రముఖుల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరపు బంధువుల రాకతో ఇంట్లో సందడి నెలకొంటుంది. వృత్తి, వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి.
సింహం:
కొత్త వాహనం కొనుగోలు చేసే యోగం ఉంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. పనుల్లోని అవరోధాలను అధిగమించి ముందుకు సాగుతారు. బంధు, మిత్రులతో సఖ్యత పెరుగుతుంది. సోదరులతో ఉన్న స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాల్లో మంచి పురోగతి ఉంటుంది.
కన్య:
పాత అప్పులు తీర్చేందుకు కొత్త రుణ ప్రయత్నాలు చేయవచ్చు. కుటుంబ విషయాల్లో ఆకస్మిక మార్పులు చోటుచేసుకుంటాయి. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. భాగస్వామ్య వ్యాపారాల్లో విభేదాలు రావచ్చు. ఉద్యోగంలో అదనపు పనిభారం ఉంటుంది.
తుల:
ఆదాయానికి సంబంధించిన విషయాలు ఉత్సాహాన్ని కలిగిస్తాయి. ఇంటా బయట ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబ సభ్యుల సలహాలు ఉపయోగపడతాయి. సేవా కార్యక్రమాలకు సహాయం అందిస్తారు. స్థిరాస్తి క్రయవిక్రయాల్లో లాభాలు పొందుతారు. ఉద్యోగంలో వివాదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం:
ముఖ్యమైన పనులు ఎక్కువ శ్రమతో పూర్తవుతాయి. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు ఇబ్బంది కలిగించవచ్చు. అవసరానికి సరిపడా ధనం చేతిలో ఉండకపోవచ్చు. నిరుద్యోగ ప్రయత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి విభేదాలు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఉద్యోగంలో శ్రమ అధికమవుతుంది.
ధనస్సు:
కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశం ఉంది. వృత్తి, ఉద్యోగాల్లో కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. కొత్త గృహం కొనుగోలు ప్రయత్నాల్లో ఆటంకాలు తొలగుతాయి. ఆర్థికంగా మరింత పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. సమాజంలో గౌరవం పెరుగుతుంది.
మకరం:
ఇంటా బయట మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. ఉద్యోగంలో మీ నిర్ణయాలకు ప్రశంసలు లభిస్తాయి. ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి మిత్రులతో ఆనందంగా గడుపుతారు. వ్యాపారానికి కొత్త పెట్టుబడులు లభిస్తాయి.
కుంభం:
మీ ప్రవర్తన వల్ల ఇతరులు అసౌకర్యంగా భావించే పరిస్థితులు రావచ్చు. వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాల్లో వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపారంలో కొత్త సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. ఉద్యోగంలో నిరుత్సాహం కలగవచ్చు.
మీనం:
ఇతరులకు హామీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనుల్లో శ్రమ పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యం పూర్తిగా సహకరించక చికాకు కలిగిస్తుంది. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది. బంధు, మిత్రులతో మనస్పర్థలు రావచ్చు. ఉద్యోగంలో కొన్ని చికాకులు ఎదురవుతాయి.

