Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఉద్యోగాలలో పదోన్నతులు

దిన ఫలాలు: నేడు ఈ రాశి వారికి ఉద్యోగాలలో పదోన్నతులు

మేషం

ఇతరులకు సహాయ సహకారాలు అందిస్తారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో పురోగతి సాధిస్తారు. చేపట్టిన పనులు ఉత్సాహంగా పూర్తి చేస్తారు.

ఆత్మీయుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

వృషభం

దీర్ఘకాలిక ఋణాల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. ముఖ్యమైన పనులలో అవాంతరాలు తప్పవు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు కలుగుతాయి. వ్యాపారమున ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ఉద్యోగమున సమస్యలు ఉంటాయి.

మిధునం

దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు. చిన్ననాటి మిత్రులతో అకారణంగా వివాదాలు కలుగుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలసిరావు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

కర్కాటకం

కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. నూతన మిత్రుల పరిచయాలు పెరుగుతాయి. బందు వర్గం వారి నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. స్థిరాస్తి కొనుగోలు చేస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలు మరింత అనుకూలిస్తాయి.

సింహం

సంఘంలో గౌరవ మర్యాదలకు కొదవు ఉండదు. స్థిరాస్తి కొనుగోలు యత్నాలు సఫలమవుతాయి. సంతానానికి నూతన విద్యావకాశాలు లభిస్తాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది.

కన్య

ముఖ్యమైన పనులలో కష్టపడ్డా ఫలితం కనిపించదు. సోదరులతో ఆస్తి వివాదాలు కలుగుతాయి. వృధా ఖర్చులు చేస్తారు. బంధువులతో మాట పట్టింపులుంటాయి. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు. అనారోగ్య సమస్యలు భాదిస్తాయి. ఉద్యోగాలలో పురోభివృద్ధి కలుగుతుంది.

తుల

ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. పనుల్లో ప్రతిష్ఠంభనలు కలుగుతాయి. సోదరులతో స్వల్ప విభేదాలు తప్పవు. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన స్థానచలనాలు ఉండవు.

వృశ్చికం

ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. వాహన అనుకూలత కలుగుతుంది. కొన్ని వివాదాలు పరిష్కారమవుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరుల ఆగమనం ఆనందం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంతో పనిచేస్తారు.

ధనస్సు

గృహమున పరిస్థితులు మానసికంగా చికాకు పరుస్తాయి. దైవ కార్యక్రమాలపై దృష్టి సారించడం మంచిది. బంధువులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులకు మీ ఆలోచనలు నచ్చవు. వ్యాపార, ఉద్యోగాలలో కష్టానికి తగిన ఫలితం ఉండదు.

మకరం

ఆప్తుల సలహాలు కలిసివస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశములు దక్కుతాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు.

కుంభం

ఆర్థికంగా ప్రతికూల వాతావరణం ఉంటుంది. దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఇంటాబయట పరిస్థితులు అనుకూలించవు. చేపట్టిన వ్యవహారాలలో ఆటంకాలు తప్పవు. మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు గందరగోళంగా సాగుతాయి.

మీనం

ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. సన్నిహితుల నుండి ఆహ్వానాలు అందుతాయి. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu