Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు

దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధన, వస్తు లాభాలు

మేషం : వృత్తి, ఉద్యోగాలలో పురోగతి సాధిస్తారు. నూతన విషయాలు తెలుసుకుంటారు. సంఘంలో పరిచయాలు పెరుగుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది.

జీవిత భాగస్వామితో దైవదర్శనం చేసుకుంటారు. ఆకస్మిక ధన, వస్తు లాభాలు పొందుతారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు.

వృషభం : ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. నూతన పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. వ్యాపారాలు విస్తరిస్తాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. దైవదర్శనాలు చేసుకుంటారు. దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందుతాయి.

మిధునం : ఉద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు ఎదురవుతాయి. రుణ ఒత్తిడి పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడులు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి.

కర్కాటకం : నూతన రుణ ప్రయత్నాలు అనుకూలించవు. వృథా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు కలిగిస్తాయి. అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. బంధువులతో స్వల్ప విభేదాలు ఉండవచ్చు. కొన్ని వ్యవహారాల్లో అంచనాలను అందుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.

సింహం : ఉద్యోగాలలో ఉత్సాహకర వాతావరణం ఉంటుంది. నూతన వ్యక్తుల పరిచయం ఆనందాన్ని కలిగిస్తుంది. కీలక సమయంలో సోదరుల సహాయం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి. శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

కన్య : వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. అనుకోని ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వృత్తి, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆర్థికంగా కొంత చికాకు ఉంటుంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలకు స్థిరత్వం అవసరం.

తుల : ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. అన్ని రంగాల వారికి నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. నిరుద్యోగులకు ఉన్నత అవకాశాలు లభిస్తాయి.

వృశ్చికం : వ్యాపార, ఉద్యోగాలు కొంత నిరాశ కలిగిస్తాయి. బంధువులతో విభేదాలు ఉండవచ్చు. వృథా ఖర్చులు పెరుగుతాయి. గృహ నిర్మాణ ఆలోచనలు అనుకూలించకపోవచ్చు. సంతానం విద్యా విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. చేపట్టిన పనుల్లో శ్రమించినా ఫలితం ఆలస్యమవుతుంది. సోదరులతో ఆస్తి వివాదాల విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

ధనస్సు : గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం లభిస్తుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మిత్రుల నుంచి విలువైన సమాచారం అందుతుంది.

మకరం : ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి. మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగస్తులకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాలలో నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగులకు పదోన్నతులు లభించే అవకాశం ఉంది. దైవ సేవా కార్యక్రమాలకు ధనసహాయం అందిస్తారు.

కుంభం : నిరుద్యోగుల ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి. చేపట్టిన పనుల్లో వ్యయప్రయాసలు అధికమవుతాయి. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి. ధన వ్యవహారాల్లో ఇతరులకు మాట ఇవ్వకుండా జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ముఖ్యమైన పనులను వాయిదా వేయడం మంచిది.

మీనం : వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులు ఉండవచ్చు. మిత్రులతో అకారణ వివాదాలు కలుగుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఉద్యోగస్తులు ఒక వ్యవహారంలో అధికారుల నుంచి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రయాణాలు చివరి నిమిషంలో వాయిదా పడవచ్చు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu