Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

దినఫలాలు: నేడు ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు

మేషం : కీలక సమయంలో ఆత్మీయుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. చాలాకాలంగా పూర్తికాని పనులు పూర్తవుతాయి.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.

వృషభం : ఉద్యోగ ప్రయత్నాలు నిదానంగా సాగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. నూతన రుణాలు చేయాల్సి రావచ్చు. వ్యాపార నిర్ణయాలలో స్థిరత్వం అవసరం. ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయకండి. శ్రమకు తగిన ఫలితం ఆలస్యంగా లభిస్తుంది.

మిధునం : వృత్తి, ఉద్యోగాలలో స్థానచలన సూచనలు ఉన్నాయి. ముఖ్యమైన పనుల్లో శ్రమకు తగిన ఫలితం వెంటనే లభించదు. ప్రయాణాల్లో వాహన ఇబ్బందులు ఎదురవుతాయి. దైవదర్శనం చేసుకుంటారు. సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలిగే అవకాశం ఉంది.

కర్కాటకం : వ్యాపార విస్తరణకు అవరోధాలు తొలగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఉద్యోగాలలో జీతభత్యాల విషయంలో అనుకూలత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది.

సింహం : భూ సంబంధిత వివాదాలు చికాకు కలిగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా పడవచ్చు. ఆర్థిక పరిస్థితి కొంత నిరుత్సాహపరుస్తుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ నిర్వహణలో జాగ్రత్తగా ఉండాలి. అధికారులతో విభేదాలు రాకుండా చూసుకోవడం మంచిది.

కన్య : చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆర్థిక వృద్ధి సాధించి పాత రుణాలు తీర్చగలుగుతారు. నూతన వస్తు, వాహనాలు కొనుగోలు చేస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు లభిస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. నిరుద్యోగులకు తగిన అవకాశాలు లభిస్తాయి.

తుల : ఉద్యోగంలో అధికారులతో వాదనలకు దూరంగా ఉండాలి. పనుల్లో జాప్యం కలుగుతుంది. పని ఒత్తిడి కారణంగా విశ్రాంతి తగ్గుతుంది. ఇంటా బయట సమస్యలు పెరగవచ్చు. వృత్తి, వ్యాపారాలలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

వృశ్చికం : చేపట్టిన వ్యవహారాల్లో కార్యసిద్ధి కలుగుతుంది. వృత్తి, ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. కీలక సమయంలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి.

ధనస్సు : సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. మొండి బాకీలు వసూలవుతాయి. బంధుమిత్రుల సమాగమం ఆనందాన్ని కలిగిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు.

మకరం : వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి అధికమవుతుంది. ఇతరులతో తొందరపడి మాట్లాడకుండా జాగ్రత్త వహించాలి. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసిరావు. ఆర్థిక వ్యవహారాల్లో గందరగోళం ఉంటుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు.

కుంభం : ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో పూర్తవుతాయి. వృత్తి, వ్యాపారాలలో స్వల్ప లాభాలు లభిస్తాయి. ఉద్యోగ వాతావరణం కొంత సమస్యాత్మకంగా ఉంటుంది. ఇంటా బయట ప్రతికూల పరిస్థితులు ఉండవచ్చు. దూర ప్రయాణాలను వాయిదా వేయడం మంచిది.

మీనం : వ్యాపారంలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో పదోన్నతులు లభించే అవకాశం ఉంది. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులకు అప్రయత్నంగా అవకాశాలు అందుతాయి. ప్రస్తుతం తీసుకునే కొన్ని నిర్ణయాలు భవిష్యత్తులో ప్రయోజనం కలిగిస్తాయి.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu