**మేషం:** దూరప్రయాణాల వల్ల శ్రమ అధికమవుతుంది. రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందకపోవచ్చు. వృథా ఖర్చులు పెరుగుతాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఆటుపోట్లు ఎదురవుతాయి.
బంధువులతో అనవసరమైన మాటపట్టింపులు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాల్లో ఆలోచనలు స్థిరంగా ఉండకపోవచ్చు.
**వృషభం:** ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఒడిదుడుకులు తొలగుతాయి. సన్నిహితులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. నూతన వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. వృత్తి, వ్యాపారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తారు.
**మిథునం:** ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు ఎదురుకావచ్చు. వ్యాపారాల్లో అప్రమత్తంగా ఉండాలి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. దూరప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిది. ఇతరులకు డబ్బు విషయంలో మాట ఇవ్వకపోవడం ఉత్తమం. ఉద్యోగంలో మీ కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు.
**కర్కాటకం:** ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి. వ్యాపార, ఉద్యోగ రంగాలు ఉత్సాహంగా సాగుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాల్లో ముందడుగు వేస్తారు. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. దూరపు బంధువుల నుంచి అందే సమాచారం ఊరట కలిగిస్తుంది. స్నేహితులతో ఉన్న వివాదాలు సర్దుమణిగే అవకాశం ఉంది.
**సింహం:** ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభదాయకంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో నూతనోత్సాహంతో ముందుకు సాగుతారు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని పనులను పూర్తి చేస్తారు. ఆదాయం సంతృప్తినిస్తుంది. సోదరులతో శుభకార్యాలకు సంబంధించిన విషయాలపై చర్చలు జరుపుతారు.
**కన్య:** దూరప్రయాణాల్లో వాహన సంబంధిత ఇబ్బందులు ఎదురుకావచ్చు. కొత్త రుణాలు చేయాల్సి రావచ్చు. ఇంటా బయట బాధ్యతలు ఒత్తిడికి గురిచేస్తాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వల్ల మానసిక ప్రశాంతత తగ్గవచ్చు. చేపట్టిన పనుల్లో అవాంతరాలు ఎదురవుతాయి. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో సమస్యలు పెరిగే అవకాశం ఉంది.
**తుల:** చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధించవచ్చు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి. బంధుమిత్రులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక నిరాశ కలిగించవచ్చు. పరస్పర విరుద్ధమైన ఆలోచనల వల్ల ఆర్థిక నష్టాలు ఎదురయ్యే అవకాశం ఉంది.
**వృశ్చికం:** ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది. నిరుద్యోగులకు కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నూతన వాహనం కొనుగోలు చేసే సూచనలు ఉన్నాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాల్లో మీ అంచనాలు నిజమవుతాయి.
**ధనుస్సు:** వ్యాపారాలు గతం కంటే మెరుగ్గా సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల ఆదరణ లభిస్తుంది. సంతానం విద్య, ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. గృహ నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నాయి.
**మకరం:** దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి మించి ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. సోదరులతో ఆస్తి సంబంధిత వివాదాలు తలెత్తవచ్చు. వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. కొత్త రుణాల కోసం చేసే ప్రయత్నాలు ఫలించకపోవచ్చు. కుటుంబ వాతావరణంలో గందరగోళం ఏర్పడే సూచనలు ఉన్నాయి.
**కుంభం:** వృత్తి, వ్యాపారాల్లో ఆశించిన లక్ష్యాలను చేరుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతాయి. సన్నిహితుల నుంచి ఊహించని విమర్శలు రావచ్చు. ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి. ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. చేపట్టిన పనుల్లో కష్టానికి తగిన ఫలితం దక్కకపోవచ్చు. ముఖ్యమైన పనులను వాయిదా వేయాల్సి రావచ్చు.
**మీనం:** వ్యాపార విస్తరణకు మిత్రుల సహాయం లభిస్తుంది. ఆదాయం గతం కంటే మెరుగుపడుతుంది. సన్నిహితులతో ఇంట్లో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యవహారాలు ఆశాజనకంగా సాగుతాయి. వృత్తి, ఉద్యోగ రంగాల్లో మీ సేవలకు తగిన గుర్తింపు లభిస్తుంది. సోదరులతో ఉన్న ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే సూచనలు ఉన్నాయి.

