Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం: ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి!

ఏపీలో ఘోర రోడ్డుప్రమాదం: ఆరుగురు వ్యవసాయ కూలీలు మృతి!

ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడు జిల్లాలో గురువారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిలకలూరిపేట జాతీయ రహదారిపై విజయవాడ నుంచి తిరుపతి వైపు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు, ఎదురుగా వస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది.

ఈ తీవ్ర ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న వారిలో ఆరుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా చిలకలూరిపేట మండలం వేలూరు గ్రామానికి చెందిన వ్యవసాయ కూలీలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. పనుల నిమిత్తం ఆటోలో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది.

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం 108 అంబులెన్సుల్లో గుంటూరు ప్రభుత్వ సమగ్ర ఆసుపత్రికి (GGH) తరలించారు. ప్రమాద తీవ్రతకు ఆటో పూర్తిగా నుజ్జునుజ్జయింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని, అతివేగమే ప్రమాదానికి కారణమా అన్న కోణంలో సమగ్ర దర్యాప్తు జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu