Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
ఏపీలో మొహర్రం సెలవులో మార్పు..కొత్త తేదీ ఇదే!

ఏపీలో మొహర్రం సెలవులో మార్పు..కొత్త తేదీ ఇదే!

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ఏడాది 'మొహర్రం' ప్రభుత్వ సాధారణ సెలవు దినాన్ని సవరిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా ప్రకటించిన వార్షిక సెలవుల క్యాలెండర్ ప్రకారం జూన్ 25వ తేదీన మొహర్రం సెలవుగా నిర్ణయించారు.

అయితే, చంద్రదర్శనం ఆధారంగా మొహర్రం పర్వదినం జూన్ 26న రానుందని రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. వక్ఫ్ బోర్డ్ నుంచి వచ్చిన అధికారిక సమాచారం మరియు అభ్యర్థనను పరిశీలించిన ప్రభుత్వం, ఈ సెలవు తేదీని మారుస్తూ తక్షణమే ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ సవరణ ప్రకారం జూన్ 25కు బదులుగా జూన్ 26వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా అధికారికంగా మొహర్రం సెలవు వర్తించనుంది. ప్రభుత్వ తాజా జీవో (ప్రభుత్వ ఉత్తర్వు) ప్రకారం ఆ రోజున రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, విద్యాసంస్థలకు సెలవు ఉంటుంది. విద్యాసంస్థలతో పాటు అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, ఇతర ప్రైవేటు కంపెనీలు కూడా జూన్ 26నే మొహర్రం హాలిడేగా పరిగణించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ ప్రత్యేక ఉత్తర్వులను విడుదల చేస్తూ, గతంలో ఇచ్చిన సెలవుల జాబితాలో మార్పులను అధికారికంగా ఖరారు చేసింది.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu