జయశంకర్ భూపాలపల్లి జిల్లా భూగర్భ గనుల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ (ఏడీ) జయరాజు నివాసాలు, కార్యాలయాలపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో ఈ తనిఖీలు చేపట్టారు.
వరంగల్ రేంజ్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు ఈ దాడుల్లో పాల్గొంటున్నాయి. భూపాలపల్లి, సూర్యాపేట, తాండూరులతో పాటు హైదరాబాద్‌లోని పలు కీలక ప్రాంతాలు కలిపి ఏకకాలంలో మొత్తం 12 చోట్ల విస్తృతంగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ తనిఖీల్లో భాగంగా జయరాజుకు సంబంధించిన కీలక పత్రాలు, స్థిర, చర ఆస్తుల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు.

