Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
గోదావరి నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం..!

గోదావరి నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం అమ్మగారిపల్లి వద్ద గోదావరి ఆనకట్టను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించారు. గోదావరి నీటిని నిల్వ చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని తెలిపారు.

దుమ్ముగూడెం ఆనకట్టపై మీటరు ఎత్తున ఇసుక బస్తాలు ఏర్పాటు చేసి సుమారు ఒక టీఎంసీ నీటిని నిల్వ చేసేలా ప్రణాళిక రూపొందించినట్లు వెల్లడించారు. దసరా రోజునే పనులు ప్రారంభించనున్నట్లు పేర్కొన్నారు.

ప్రస్తుతం గోదావరి నదిలో నీటి ప్రవాహం తక్కువగా ఉందని, అందుబాటులో ఉన్న నీటిని వినియోగంలోకి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నామని మంత్రి తుమ్మల తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు లేక భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సూపర్ ఎల్‌నినో ప్రభావంతో ఉష్ణోగ్రతలు 50 డిగ్రీలు దాటే అవకాశం ఉందని పేర్కొన్నారు.

నీటి కొరత కారణంగా రైతులు ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పంటలు వేయకపోయినా పర్వాలేదు కానీ, చేతికందే పంటలు నీళ్లు లేక ఎండిపోయే పరిస్థితి రాకూడదని అన్నారు. తక్కువ నీరు అవసరమయ్యే పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. నీటి కొరతతో పాటు విద్యుత్ ఉత్పత్తి తగ్గుతున్న నేపథ్యంలో వరి సాగు విషయంలో రైతులు జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలని తెలిపారు.

రాష్ట్రంలో తాగునీటి కష్టాలు తలెత్తకుండా గోదావరి నీటిని నిల్వ చేయాల్సిన అవసరాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వివరించినట్లు మంత్రి వెల్లడించారు. దీనిపై స్పందించిన సీఎం.. దుమ్ముగూడెం ఆనకట్టపై ఇసుక బస్తాలు ఏర్పాటు చేసే పనులను తక్షణమే చేపట్టాలని ఆదేశించినట్లు తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu