Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
GOOD NEWS: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ.. 'తొలి ప్రాధాన్యత వారికే'

GOOD NEWS: రెండో విడత ఇందిరమ్మ ఇళ్ళ పంపిణీ.. 'తొలి ప్రాధాన్యత వారికే'

తెలంగాణను గుడిసెలు లేని రాష్ట్రంగా మార్చేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందుకోసం 'ఇందిరమ్మ ఇళ్ల పథకం' రెండో విడతను అస్త్రంగా ఎంచుకుంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి గానూ రాష్ట్రవ్యాప్తంగా 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తూ ప్రభుత్వం శుక్రవారం జీవో ఎంఎస్‌-22ను జారీ చేసింది.

మొదటి విడత కొనసాగుతుండగానే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. ఈ రెండో విడతలో మొదటి విడతకు భిన్నంగా గుడిసెలు, రూఫ్‌టాప్ లేని ఇళ్లు, గోడల దశల్లో నిలిచిపోయిన ఇళ్లకు ప్రత్యేక వెసులుబాట్లు కల్పించారు.

మొత్తం 2.50 లక్షల ఇళ్లలో:

కొత్త ఇళ్లు: 100 నియోజకవర్గాల్లో (జీహెచ్‌ఎంసీ మినహాయింపు) నియోజకవర్గానికి 1,500 చొప్పున 1,50,000 ఇళ్లు.

రూఫ్ రీప్లేస్‌మెంట్/షెల్టర్ అప్‌గ్రెడేషన్: నియోజకవర్గానికి 500 చొప్పున 100 నియోజకవర్గాలకు కలిపి 50,000 ఇళ్లు.

రాష్ట్ర రిజర్వ్ కోటా: దీని కింద మరో 50,000 ఇళ్లను (కొత్త ఇళ్లు 30 వేలు, రూఫ్ రీప్లేస్‌మెంట్ కింద 20 వేలు) కేటాయించారు.

అయితే, అర్హుల ఎంపికలో ప్రభుత్వం స్పష్టమైన ప్రాధాన్య క్రమాన్ని నిర్ణయించింది. ప్రస్తుతం వివిధ సర్వేల ప్రకారం రాష్ట్రంలో దాదాపు 15 వేల కుటుంబాలు గుడిసెల్లో నివసిస్తున్నట్లు గుర్తించారు. ఈ రెండో విడతలో వీరందరికీ మొదటి ప్రాధాన్యత ఇస్తూ ఇళ్ల మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అలాగే, గోడలు, స్లాబుల దశల్లో నిలిచిపోయిన ఇళ్లను పూర్తి చేసుకునేందుకు రూ. 2 లక్షల వరకు ఆర్థిక సాయం అందించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి మార్గదర్శకాలు త్వరలోనే విడుదల కానున్నాయి.

లబ్ధిదారుల ఎంపికలో ఎలాంటి అవకతవకలు జరగకుండా జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. గెజిటెడ్ అధికారులతో అర్హుల ధ్రువీకరణ, జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రుల ఆమోదం తర్వాతే ఇళ్లను మంజూరు చేస్తారు. లబ్ధిదారులే స్వయంగా నిర్మించుకునే ఈ పథకాన్ని.. ప్రధాన మంత్రి ఆవాస యోజన (అర్బన్, రూరల్), పీఎం జన్మన్, ఎన్‌ఆర్‌ఈజీఎస్ (MGNREGS) వంటి కేంద్ర పథకాలతో అనుసంధానం చేయనున్నారు. ఇందుకోసం లబ్ధిదారుల వివరాలను ఆయా పోర్టల్స్‌లో నమోదు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu