Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..భయాందోళనలో జనం! (video)

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..భయాందోళనలో జనం! (video)

హైదరాబాద్‌లోని గుడిమల్కాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మొఘల్ కా నాలా సమీపంలోని ఓ ఫర్నిచర్ గోదాములో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

గోదాములో చెక్క సామగ్రి, ఫోమ్, రసాయన పదార్థాలు వంటి మండే స్వభావం కలిగిన వస్తువులు అధికంగా ఉండటంతో క్షణాల వ్యవధిలోనే మంటలు భవనం మొత్తం విస్తరించాయి. ఆకాశాన్ని తాకేలా భారీగా ఎగసిపడిన అగ్నికీలలు, దట్టమైన పొగ పరిసర ప్రాంతాలను కమ్మేయడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది పలు ఫైరింజన్లతో సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనే ఉన్న నివాస గృహాలకు, ఇతర వాణిజ్య సముదాయాలకు వ్యాపించకుండా సహాయక చర్యలను ముమ్మరం చేశారు. గుడిమల్కాపూర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాథమికంగా షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానిస్తున్నప్పటికీ, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు, ఆస్తి నష్టం వివరాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. అదృష్టవశాత్తూ ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు భావిస్తున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu