Dailyhunt Logo
  • Light mode
    Follow system
    Dark mode
    • Play Story
    • App Story
Hyderabad: చెల్లెలి ఫొటోలు మార్ఫింగ్ చేసి అన్నకు పంపాడు.. చివరకు..

Hyderabad: చెల్లెలి ఫొటోలు మార్ఫింగ్ చేసి అన్నకు పంపాడు.. చివరకు..

హైదరాబాద్ నగరంలో మార్ఫింగ్ ఫొటోలతో బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడిన ఒక కిరాతక ఘటన వెలుగులోకి వచ్చింది. ప్రేమించిన యువతితో వచ్చిన విభేదాల కారణంగా, ఆమె ఫొటోలను నగ్న చిత్రాలుగా మార్ఫింగ్ చేసి, సదరు యువతి అన్నకే పంపించి బెదిరింపులకు దిగాడో ఉన్మాది.

ఈ ఘటనపై జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు కాగా, అనంతరం కేసును దర్యాప్తు నిమిత్తం మేడ్చల్ పోలీసులకు బదిలీ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ఒకే కాలేజీలో చదువుతున్న యువతి, ఒక యువకుడి మధ్య పరిచయం ఏర్పడింది. అయితే కొద్దిరోజుల తర్వాత వారి మధ్య కొన్ని వ్యక్తిగత విభేదాలు తలెత్తాయి. దీంతో కక్ష పెంచుకున్న నిందితుడు, సదరు యువతి ఫొటోలను సాంకేతికత సాయంతో అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి నగ్న చిత్రాలుగా మార్చాడు. అంతటితో ఆగకుండా, ఆ ఫొటోలను బాధితురాలి అన్న మొబైల్‌కు పంపించి తీవ్రంగా బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు.

ఈ వేధింపులపై తీవ్ర ఆందోళనకు గురైన బాధితురాలి కుటుంబ సభ్యులు న్యాయం కోసం మొదట నేరేడ్‌మెట్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు. అయితే, సాంకేతిక కారణాల రీత్యా ఆ ఘటన తమ పోలీస్ స్టేషన్ పరిధిలోకి రాదని అక్కడి పోలీసులు తెలపడంతో, బాధితులు జవహర్‌నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. బాధితుల ఫిర్యాదు తీవ్రతను అర్థం చేసుకున్న జవహర్‌నగర్ పోలీసులు వెంటనే స్పందించి, అక్కడ జీరో ఎఫ్‌ఐఆర్ (Zero FIR) నమోదు చేశారు. ఆ తర్వాత తదుపరి చట్టపరమైన చర్యల కోసం కేసును అధికారికంగా మేడ్చల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ చేశారు.

ఈ మార్ఫింగ్ దారుణంపై కేసు నమోదు చేసుకున్న మేడ్చల్ పోలీసులు తక్షణమే రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడిని గుర్తించి, అతడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితుడు ఈ ఫొటోలను ఇంకా ఎవరికైనా పంపాడా? మొబైల్‌లో డేటా ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరుపుతున్నారు.

Dailyhunt
Disclaimer: This content has not been generated, created or edited by Dailyhunt. Publisher: News Meter Telugu